ఆధ్యాత్మిక జ్ఞానం_01




1. కార్తవీర్యార్జునుని సంహరించినది ఎవరు?
పరశురాముడు

2. స్కాందపురాణంలో ఎన్ని శ్లోకములు ఉన్నాయి?
81, 000 వేలు

3. ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు ఎవరు?
ద్రోణుని పుత్రుడైన అశ్వత్థామ

4. మధుకైటభులు అనే రాక్షసులకు శ్రీ మహావిష్ణువుకు మధ్య ఎన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది?
5 వేల సంవత్సరాలు

5. స్వాయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రతుని భార్యపేరు ఏమిటి?
మాలినీదేవి

6. ప్రహ్లాదుని గురువుల పేర్లు ఏమిటి?
చండా, మార్కులు

7. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ అయిన ప్రజాపతి ఎవరు?
కశ్యప ప్రజాపతి

8. బలిచక్రవర్తి తండ్రి పేరు ఏమిటి?
విరోచనుడు

9. సూర్యుని భార్య అయిన సంజ్ఞదేవి ఎవరి పుత్రిక?
విశ్వకర్మ పుత్రిక

10. వేద విభాగం ఏ యుగంలో జరిగింది?
ద్వాపర యుగంలో

11. అర్జునుడు సుభద్రను ఎక్కడ వివాహమాడినాడు?
ద్వారకలో

12. మహాభారతంలో శిఖండి తండ్రి పేరు ఏమిటి?
కాశీరాజు

13. భాగవత పురాణములో ఎన్ని శ్లోకములు కలవు?
18,000

14. విరాటరాజు కొడుకైన ఉత్తరుని సంహరించినది ఎవరు ?
శల్యుడు

15. రంభుడు, కరంబులు అనే దానవులు ఎవరి పుత్రులు?
దానవరాజయిన దనువు పుత్రులు

16. శుక మహర్షి (వ్యాస మహర్షి కుమారుడు) భార్య పేరు ఏమిటి?
పీవరి

17. ఎవరి శాపం వల్ల మహాభిషుడనే చక్రవర్తి భూలోకంలో శంతన మహారాజుగా జన్మించెను?
బ్రహ్మ శాపం

18. ప్రజానీకాన్ని సృష్టిచేసిన తొలి మనువు ఎవరు?
స్వాయంభువ మనువు

19. భవిష్య పురాణములో ఎన్ని శ్లోకములు కలవు?
14,500 శ్లోకములు

20. మహాభారతంలో శకునిని సంహరించినది ఎవరు?
సహదేవుడు

21. బ్రహ్మ వైవర్త పురాణమును ఎవరు ఎవరికి ఉపదేశించారు?
సావర్ణునిచే నారదునకు

22. శిశుపాలుని కుమార్తె అయిన రేణుమతిని పెండ్లాడినది ఎవరు?
నకులుడు

23. ఎవరిని సంహరించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడు?
మారీచ సుబాహులు

24. మహా భక్తుడైన ధృవుని (దృవ తార) పుత్రులు ఎవరు?
శిష్టి , భవ్యుడు

25. మహిషాసురుని తండ్రి ఎవరు?
రంభుడు

26. నారదపురాణములో ఎన్ని శ్లోకములు కలవు?
25,000 శ్లోకములు

27. కంసుని తల్లి పేరు ఏమిటి?
పద్మావతి

28. రాముడు, హనుమంతుడు మొట్టమొదటిసారి కలుసుకున్న ప్రదేశం?
ఋశ్యమూక పర్వతం

29. దుర్యోధనుని కొడుకు లక్ష్మణుని వధించినది ఎవరు?
అభిమన్యుడు

30. మహాభారతంలో మాద్రి (పాండురాజు రెండో భార్య) అన్నగారు ఎవరు?
శల్యుడు

31. బ్రహ్మపురాణముకు గల ఇతర నామములు ఏమిటి?
ఆదిపురాణము లేదా సూర్యపురాణము

32. ఉలూచి (నాగకన్య), అర్జునుల కుమారుడు ఎవరు?
ఇరావంతుడు

33. అజ్ఞాతవాస కాలంలో పాండవులు అయుధాలను ఏ వృక్షంపై దాచి వుంచారు?
శమి వృక్షము (జమ్మి చెట్టు)

34. గంఢీవాన్ని అర్జునునికి ప్రసాదించిన దేవత ఎవరు?
అగ్నిదేవుడు

35. ప్రహ్లదుని కుమారులలో ముఖ్యుడు ఎవరు?
విరోచనుడు