గురుదేవుల సుభాషితములు

గురుదేవుల సుభాషితములు




1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాంగ  నమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని, విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు.  లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి. నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.