పట్టుదల - ఫలితం

పట్టుదల


ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు..

నేను ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ? మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహము కలిగినది.
వెంటనే మారువేషంలో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు. రైతు నాకెందుకో తప్పక వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను అన్నాడు.

ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు. కాని రైతు దున్నడము మానలేదు.
ఇంద్రునికి కోపము వచ్చింది. వరుణుడిని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు.

వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రం  నేను ఏమీ చేయ్యలేనన్నాడు.

పవనుడిని పిలిపించి అక్కడ చల్లనిగాలి వీచకూడదు అని చెప్పాడు. దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రమ్ నేను ఏమీ చెయ్యలేను అన్నాడు.

ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు.
కప్పల నాయకుడు మేము ఈ రోజు అస్సలు అరవము, కానీ మిణుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రమ్ మేము ఏమీ చెయ్యలేము అన్నాడు.

ఇంద్రుడు వాటిని పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు, అవి సరే మేము అస్సలు
ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి.

ఇంద్రుడు ఇంక వర్షం ఎలా కురుస్తుందో చూద్దామ్ అనుకొన్నాడు. కానీ ఆ రాత్రి వర్షం కురిసింది..

ఇంద్రునికి అవమానంతో పట్టరాని కోపము వచ్చింది.
అందరినీ పిలిపించాడు . వరుణుడు చల్లగాలి వీచింది  మహారాజా! అన్నాడు.

పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నాడు.
కప్పలు మినణుగురులు మిణుకు మిణుకు మని మెరవడమ్ వల్లే అరిచాము అన్నవి.
మిణుగురు పురుగులు మేము మాత్రము  అస్సలు బయటకు రాలేదు అన్నవి.

ఇంద్రునికి ఏమి జరిగిందో పాలుపోలేదు.  నారదునికి విన్నవించారు. నారదుడు రాత్రి జరిగినది చెప్పాడు.

ఆ రైతు రాత్రి పోలములో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు.
ఆ దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి. కప్పలు అరవడంతొ చల్లటి గాలి వీచింది. దానితో వర్షం కురిసింది అని చెప్పాడు.

నమ్మకంతో ప్రయత్నం చేసినవారు వారు ఎన్నడూ నష్టపోరు,
ప్రయత్నం చేస్తే  తప్పకుండ పలితం వస్తుంది. 

పట్టుదలతో పని చేస్తే తప్పక ఫలితం ఉంటుందని  చెప్పే చిన్న కథ