ఆణిముత్యం

నేటి ఆణిముత్యం కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంరి౮ కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

తాత్పర్యం:

భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.

నమస్కారం ::  మన సంస్కారం తూర్పుదిక్కు కు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది.

పశ్చిమ దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం. భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.
                   
ఉత్తర దిక్కు నమస్కారం బంధుమిత్రుల ఆదరణకు కృతజ్ఞత చెప్పడం. బంధుమిత్రులను ఎప్పడూ దూరం చేసుకోకూడదు.

దక్షిణ దిక్కుకు నమస్కరిస్తే గురుపరంపరకు నమస్కరించినట్లు. గురువులను గౌరవించాలి.
     
భూమికి నమస్కారం చేయడమం అంటే సాటివారి ఆదరణకు కృతజ్ఞత తెలపడం.

 ఆకాశం వైపు నమస్కరించడం మన పూర్వీకులైన మహర్షులకు, ప్రస్థుత ఉన్న మహాత్ములకు ఆశీస్సులు కోరుతూ, కృతజ్ఞతలు తెలపడం.

 అందు వలన రోజూ ఒకసారి  స్నానం చేసాక అన్ని వైపులకు తిరిగి   నమస్కరించి అందరికీ కృతజ్ఞతలు చెప్పవలెను.