అన్నదానం గొప్పతనం ఏమిటి?


ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అన్నదానం ఒక పవిత్రమైన అర్పణగా భావించడం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఒక గొప్ప సంస్కృతి. అలాంటి అన్నదానం ప్రాముఖ్యత గూర్చి సద్గురు వివరణ.
ప్రశ్న: నమస్కారం సద్గురు, అన్నదానం ప్రాముఖ్యత ఏమి? ఎందుకు అది మన సంస్కృతిలో గొప్పదిగా విరాజిల్లుతోంది? ఆకలి అనేది చాలా దుర్భరమైన అనుభవం.
సద్గురు: ఆకలి అనేది చాలా దుర్భరమైన అనుభవం కావచ్చు.ఈ జన్మలో నాకు ఆహారానికి లోటు లేదు. కానీ, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి ఆకలి బాధను నేను రెండు జన్మల పాటు అనుభవించాను. ఆకలితో ఉంటూ హుందాగా, తదేక దృష్టితో ఉండడం ఒక పెద్ద సవాలు, నన్ను నమ్మండి. ఇలా  ఉండటమే ప్రతి సన్యాసి చేసే గొప్ప సాధన. మన బ్రహ్మచారులు కూడా  చిన్నపాటి మార్గంలో ఈ సాధన చేస్తారు. ప్రతి ఏకాదశి రోజున అంటే పౌర్ణమి లేక అమావాస్య తరువాత వచ్చే పదకొండవ రోజు, వారంతా ఏమి తినకుండా ఉపవాసం ఉంటూనే,  మామూలు రోజు కంటే మరింత ఉత్సాహంగా పనిలో లీనమవుతారు. అలా చేయడం ద్వారా ఆకలి బాగా వేస్తుంది. 
చాలా మందికి ఆకలితో ఉన్నపుడు జీవితం చేజారి పోతున్నట్లుగా అనిపిస్తుంది. మనం అస్సలు ఏమి తినకుండా ఉంటే, మనం చనిపోతాము. కాబట్టి అన్నదానం అనేది జీవాధారం. మహాశివరాత్రి వంటి పర్వదినాలలో, ఈశా యోగ కేంద్రానికి వచ్చేవారిలో చాల మంది కనీసం యాభై రూపాయలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉంటారు. కానీ వారంతా ఇక్కడికి రావాలని కోరుకుంటారు. వారంతా ఎంతో దూర ప్రాంతాల నుంచి నడిచి వస్తారు, ఎందుకంటే కనీసం బస్సు ఛార్జీలను కూడా చెల్లించలేని స్థితిలో వారు ఉంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నదానం ఎంతో ఉపయోగపడుతుంది.   

శరీరానికి ఆహారం

అన్నిటికీ మించి,  అన్నదానం చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. మీ భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా  ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నదానం చేస్తే, వారికి శరీరాన్ని అందిస్తునట్లే.
ఆహారం పట్ల కొంత  స్పృహని , అవగాహనని  మీలో కలుగచేయడానికి అన్నదానం మీకొక గొప్ప అవకాశం. మీరు దానిని ఆహారంగా మాత్రమే చూడొద్దు, అది జీవితం. మీ ముందు ఆహారం వున్న ప్రతి సారీ, అది వాడి  పడేసే పదార్ధంలా కాకుండా  అది   జీవం  అని అర్థం చేసుకోవాలి. మీ జీవితాన్ని ఉన్నతం చేసు కోవాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ఆహారాన్ని, నీటిని, గాలిని, భూమిని ఒక జీవంగా చూడాలి, ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు. మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే, అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి. అలాగాక మీరు వాటిని ఒక పదార్ధంగా  చూస్తే, మీ వ్యవస్థ  మార్కెట్ లా తయ్యారవుతుంది.
ప్రేమ, అంకిత భావంతో తో  వడ్డించి, అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది  మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేస్తారు ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు. ఇది ఎంతో ప్రాముఖ్యమైంది, ఎందుకంటే ఒకరు మిమ్మల్ని తమ కన్నా ఎక్కువగా చూస్తూ మీ నుండి స్వీకరిస్తున్నారు. 

ప్రపంచానికి మాతృమూర్తి

మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలిమీరు మీ అమ్మను ఒక గొప్ప ప్రేమ మూర్తిగాకృతజ్ఞతతో చూస్తారుకానీ ఆమె మీకు ఆహారం ఇవ్వకుంటేమీరు ఆమెను ప్రేమించగలరాఅమ్మతనంలో ఉన్న గొప్ప గుణం అన్నదానం. తన పాలతో మిమ్మల్ని పోషించిఆహారాన్ని మీకు అందింస్తుంది. అందువల్లే అమ్మను మీరు అంతగా  ప్రేమిస్తారు. కాబట్టిప్రపంచానికి మీరు ఒక మాతృమూర్తి లా సేవ చేయడానికి అన్నదానం మీకు గల ఒక గొప్ప అవకాశం. మీ జీవితంలో ప్రతి రోజుప్రతి క్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఇది.