పౌర్ణమి గరుడసేవ వైభవం
తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.  రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. 


 ఈ సందర్భంగా ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులు నాలుగుమాడ వీధులలో కోలాహలంగా భజనలు, కోలాటాలు, చెక్కభజనలు నిర్వహించారు.