కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం



తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. 
ఆలయంలో జూన్ 23 నుంచి జూలై 1 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. 

ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైనవి అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చదాకు, గడ్డకపురం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.అనంతరం భక్తులను మధ్యాహ్నం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు:


తేదీ ఉదయం సాయంత్రం

23-06-2018 (శనివారం) ఉదయం ధ్వజారోహణం (మిధున లగ్నం)సాయంత్రం పెద్దశేష వాహనం

24-06-2018 (శనివారం) ఉదయం చిన్న వాహనం, సాయంత్రం హంస వాహనం

25-06-2018 (సోమవారం) ఉదయం సింహ వాహనం, సాయంత్రం ముత్యపుపందిరి వాహనం

26-06-2018 (మంగళవారం) ఉదయం కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సాయంత్రం సర్వేపూపాల వాహనం

27-06-2018 (బుధవారం)ఉదయం  మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహనం

28-06-2018 (గురువారం)ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనం

29-06-2018 (శుక్రవారం)ఉదయం సూర్యప్రవేశ వాహనం, సాయంత్రం చంద్రపాప వాహనం

30-06-2018 (శనివారం)ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం

1-07-2018 (ఆదివారం)ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. 

జూన్ 26 న సాయంత్రం 5.00 నుండి 7.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం  వైభవంగా నిర్వహించనున్నారు. . రూ .500 / - చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక పాప, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.