శ్రీకృష్ణుడు నెమలి పింఛము

నెమలి పింఛము ఏ దేవుళ్లుకు లేని అలంకార భూషణము ఒక్క గీతాభోధక ఆచార్యుడు, భగవానుడు శ్రీకృష్ణుడు  మాత్రము అలంకార 
భూషణoగా, తన తలపై నెమలి పింఛము ధరించుటలో అర్థం ఏమిటి? పరమార్థం ఏమిటి? నెమలి ఈకకు వున్న విశిష్టత ఏమిటి?

          మొట్టమొదటిగా  నెమలి పింఛము యొక్క ఆకారము గమనిద్దాం. నెమలి పింఛము మధ్య భాగము నలుపు కలిసిన నీలిరంగు తో కూడుకొని కొద్దిగా గుండ్రముగా ఆకర్షణగా కనిపిస్తూoటుoది.  

ఈ భాగము పింఛములో ప్రత్యేకముగా మెరుపు గల ఆకుపచ్చ రంగు ఉండును. తరువాత లేత గోధుమరంగు ఆకారము చుట్టు వుoడును, దాని  చుట్టూ మెరుపు కలిగి ఉండును.  దీని చివర అంచు, మెరుపు తరువాత చుట్టూ గుర్తించలేనంత లేతగా ఒక రంగు ఉండును. మొత్తము పైన నాలుగు భాగములు ఉండును. కాని బయట నుoడి మూడు గుండ్రటి భాగములుoడి, మధ్యలో కన్నుగా లేదా కేంద్రముగాగా కనిపించును.

వివరము: మన శరీరములో జరుగు కార్యములు అన్నిoటికిని గల గుణములు అన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో అమర్చబడి ఉన్నది. ఆ పద్ధతి, ఒక చక్రముగా నిర్మితమై ఉన్నది.  గుణములను మనము మూడు రకములుగా విభజించ వచ్చును. అవి యేవన:      
   
 (1) సాత్వికము 
(2) రాజసము 
(3) తామసము. 

ఈ మూడు రకముల గుణములు, గుణ చక్రములో మూడు భాగములుగా విభజింపబడి ఉన్నది. అనగా మనము ఈ మూడు చక్రములను సాత్విక భాగము, రాజస భాగము మరియు తామస భాగములుగా పిలుచుకొన వచ్చును.  

ఈ మూడు భాగముల మధ్యన ఒక గుండ్రటి భాగము ఒకటి కలదు. దానినే మనము “బ్రహ్మనాడి” అని అనవచ్చు. ఆత్మదానియందే నివాసమున్నది. ఈ బ్రాహ్మ నాడిని ఇరుసుగా చేసుకొని, కంటికి కనిపించని గుణచక్రము అమరిఉన్నది. 

మానవాళి మొత్తము, సకల జీవరాసులు, క్రిమికీటకాదులు, సమస్త జీవరాసులు ఈచక్రములోనే చిక్కుకొని వున్నాయి.
 జీవుడు వసించు భాగమును బట్టి , జీవునికి సాత్విక జీవుడు, రాజస జీవుడు, తామస జీవవుడుగా చెప్పుకోన వచ్చును. ఏది ఏమైనా ఏ జీవికైన - మధ్యలో ఉన్న ఆత్మయే సాక్షిగా ఉన్నది.  మధ్యలో నున్న ఆత్మకు తెలియని జీవరాశి లేదు.

  ప్రతి శరీరములోని గుణచక్రము మధ్యలో ఉన్న ఆత్మ తన చుట్టూ ఉన్న గుణములతో సంభoదం లేక సాక్షి గా ఉండును.
 జీవరాశి  గుణముల వలన చేయు ప్రతి పనుల పర్యవసానము, పాప పుణ్యములు కలుగుచున్నది.  పాప పుణ్య కర్మలు జీవాత్మ కే గాని మధ్యననున్న ఆత్మకు అంటదు.   

ఆత్మ శక్తి ఈశరీరమం తా వ్యాపించివుండి, కదలిక నిచ్చినా,  ఈ కదలికలు గుణములను అనుసరించి జరిగినా, ఆత్మకు మాత్రము కర్మ అంటక, అన్నిoటికిని సాక్షిగా నిలచివున్నది.

 నెమలి పింఛము, మధ్యనగల గుర్తింపు భాగము గుణచక్రములో మధ్యన గల ఆత్మా నివాస స్థానముగా తెలుసుకోవాలి. పింఛము యొక్క రెండవ భాగము సాత్విక భాగమును, మూడవ భాగము రాజస భాగమని, అట్లే, చివరి భాగము, తామసభాగమని తెలిసుకోవాలి.

ఈ విధముగా నెమలి పింఛమునకు గుణచక్రములకు సమాన పోలికలు గలవు.  అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు, నేను పనులను చేయుచున్నాను. నాకు ఏ గుణకర్మ అంటదు. కర్మ అంటని ఆత్మలాగా, మూడు గుణముల మధ్యనున్నాను. 

అందువలననే ఈ మూడు రంగులు కల నెమలి పింఛమును ధరియించి యున్నాను అని మనకు తెలియ చేస్తున్నారు.
 వైద్య శాస్త్ర రీతిగా మానవ శరీరములో బ్రహ్మ నాడి, తలనుండి గుదస్తానము వరకు వ్యాపించి వున్నది.  ఇదియే అన్ని అవయవములకు చిన్న చిన్న నరముల ద్వారా  కదలికలను కల్గిoచు చున్నది. అవయముల నుండి వచ్చు విషయములు కుడా బ్రహ్మ నాడి నుండియే  పైకి  చేరు చున్నది.

 నెమలి పింఛమును బాగా గమనించండి.,బ్రహ్మ నాడి  లాగా ఒక పెద్ద ఈనె ఒకటి వెనుక వైపు నుండి దాని నుండి అనేక శాఖలుగా ప్రక్కలకు సన్నటి వెంట్రుకలుండును. వాటిని చిన్న చిన్న  నాడులుగా భావించవలెను.  నెమలి పింఛమున పైన కనిపించు నాల్గు భాగములు గుణ చక్ర భాగములుగా భావించవచ్చును.

శ్రీ కృషులు వారు నెమలి ఈక ను ధరియించి మనకు తెలుపు విషయములు ఏవి అనగా:--

1. సర్వ జీవ రాసుల యందును ఈ విధమైన అమరిక యే గలదని, మనకు  తెలియ చేయుట.

2. సర్వ జీవులకు  ఆత్మ, సాక్షి గా వున్నదని మనకు  తెలియ చేయుట.

3. ఆత్మ మూడు గుణములకు మధ్యన నుండినను, ఏ గుణములకు సంభందము లేదని మనకు  తెలియ చేయుట.

4. ఏ పనులు చేయుచున్నను, వాటి కర్మ,- మధ్యన గల నాకంటదని, మనకు  తెలియ చేయుట.

5. సర్వ జీవరాసుల శిరస్సు లోనే—ఆత్మ,మరియు గుణములున్నాయని మనకు  తెలియ చేయుటకై తన తలపై  నెమలి పింఛమును ధరియిoచినారు.

6. చివరి అంచు రంగు లేనిదై,  రెండవది దానికంటే ఎక్కువ కనిపించునదై,  మూడవది, రెండవ దానికంటే మరీ ఎక్కువ కనిపించునదై,  నాలుగవది అన్నింటికన్నా ఉన్నతముగా కనిపిoచునదిగా ఉన్నధి.  

ఈ ఉన్నతములు అన్ని ఇచటనే తప్ప, నన్ను చేరునపుడు కాదు, చివరకు నన్ను చేరవలసినదేనని మనకు  తెలియ చేయుట.

      భగవథ్గీత, రెండవ అధ్యాయమైన కర్మ యోగములో 28 శ్లోకము లో చెప్ప బడినట్లుగా:--

“తత్వ విత్తు మనోభాహో గుణకర్మ విభాగయో: గుణాగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే”

తా!! గుణ కర్మల విభాగములు తెలిసిన వాడు ఆత్మను తెలిసినవాడగును. అటువంటి వాడు గుణములచేత  జరిగెడు పనులు ఎన్ని అయినను చేయుచున్నను,,చేయనివాడే నని తెలుపు నిమిత్తము శ్రీకృష్ణ పరమాత్మ  నెమలి పింఛమును ధరియిoచినారు

అసలు విషయము ఏమనగా ..  ఈ జగత్తు నందు పై శ్లోకములో ఉదహరిoప బడిన నాలుగు వర్ణములు గుణచక్రములోని నాలుగు భాగములే. 

మొదటి భాగము వారు తామసులు, రెండవ వారు రాజసులు, మూడవ వారు సాత్వికులు, ఇక మిగిలిన నాలుగవ  వారు యోగులు. యోగమాచరించు వారు గుణ రహితులై ఆత్మను పొందినవారు కాన వారిని యోగులనటం జరిగినది. ఈ నాలుగు వర్ణములకు పరమాత్మ సంభందము లేనివాడై ఉన్నారు. అందులకే తాను కర్తనై కాకుండానున్నాడన్నారు.
“ నాకు కర్మములంటవు. నాకు వాని ఫలములందు ధ్యాసలేదు. నేనెట్టి వాడనని ఎవరేరుగుదురో, వారికి కర్మ భoదములు కలుగవు.”

అనగా కృష్ణ పరమాత్మ తాను  నెమలి పింఛమును ధరియించటలో ఏ అర్థముమున్నదో దాని ప్రకారము ఆయనకు కర్మలు అంటవు అని అన్నాడు. ఎ విధముగా ఆయనకు కర్మలు అంటవని అన్నారో ఆదేవిధముగా మనలను ఆవిదానాన్ని అనుసరించి కర్మల నoటకుండా చేసుకొనవలెనని భావము.   
       ఓం శాంతి.......... ఓం శాంతి...........ఓంశాంతి