జూలై 12న శ్రీవారి సేవ ”నవరాత్రి బ్రహ్మోత్సవాల” స్లాట్‌ విడుదల ఈ ఏడాది అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవ స్లాట్‌ను రేపు జూలై 12వ తేదీన టిటిడి విడుదల చేయనుంది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను జూలై 12వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ను అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి గలవారు తమ ఆధార్‌ కార్డు ద్వారా నమోదు చేసుకోవచ్చు.

అక్టోబరు 9 నుండి 15వ తేదీ వరకు, 
అక్టోబరు 10 నుండి 16వ తేదీ వరకు 7 రోజుల స్లాట్‌ అందుబాటులో ఉంటుంది. 

18 నుండి 60 ఏళ్లలోపు వయసు ఉన్నవారు బుక్‌ చేసుకోవచ్చు.

 4 రోజుల స్లాట్‌ అక్టోబరు 15 నుండి 18వ తేదీ వరకు ఉంటుంది.
 ఈ స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు అక్టోబరు 14న రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 

3 రోజుల స్లాట్‌ అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు అక్టోబరు 11న రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 

4 రోజుల స్లాట్‌, 3 రోజుల స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు 25 నుండి 50 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు. 

శ్రీవారి సేవకులు తమకు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే తిరుమలలోని సేవా సదన్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాగానీ, ముందుగానీ వచ్చేవారు అనుమతించబడరు. సేవకులు రిపోర్టు చేసే సమయంలో ఆధార్‌ ఒరిజినల్‌ కార్డు, ఒక జెరాక్స్‌ కాపి, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది.

టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.orgలో ‘శ్రీవారిసేవ సర్వీసెస్‌’ అనే లింక్‌ను క్లిక్‌ చేసి లేదా  http://srivariseva.tirumala.org/   స్లాట్లను బుక్‌ చేసుకోవచ్చు.

 ఇందులో శ్రీవారి సేవకులు తమకు ఆసక్తి గల విభాగాలను ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది.