జూలై 6న డయల్‌ యువర్‌ ఈవో



తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జూలై 6వ తేదీన జరుగనుంది. 

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. 

ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 

0877-2263261