కెన్యా మాజీ ప్రధాన మంత్రివర్యులు గౌ|| శ్రీ రైలా ఓడింగ్‌



కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనంతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని కెన్యా మాజీ ప్రధాన మంత్రివర్యులు గౌ|| శ్రీ రైలా ఓడింగ్‌ కొనియాడారు. 

గౌ|| మాజీ ప్రధాన మంత్రివర్యులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం విఐపి బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.







ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కెన్యాలో అనేక హిందూ దేవాలయాలు, అసియాలోని వివిధ మతాలకు చెందిన ప్రార్థన మందిరాలు ఉన్నాట్లు వివరించారు. హిందూమతం ప్రపంచంలోనే పురాతనమైనదని, ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, దేవుడిపై నమ్మకంతో రూపొందిందన్నారు.

భారత ప్రభుత్వం, టిటిడి సహకారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.