Banner AD

Just Watch

>

మహా సంప్రోక్షణ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?


మహా సంప్రోక్షణ  కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? 

పన్నెండేళ్లకు ఒకసారి

నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.

విగ్రహ ప్రతిష్టాపన

ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.


ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమత్తులు చేస్తారు.

 ఈ క్రమంలో మొదట శ్రీవారి మూలవిరట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నింపటమే అష్టబంధన కార్యక్రమం.


ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువలతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదల కింద మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెళ్లం ఉంటాయి.


ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గిపోతుంది. తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 ఈ మహాసంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమయ్యింది. చివరిగా 2006లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది.

అష్టబంధన కార్యక్రమం

 ఇతర ఆలయాల్లో మాదిరి ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

ఈ బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు.

 మొదటగా శ్రీవారి మూలవిరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మంటపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు. అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. మూలవిరాట్ కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. 

ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపింస్తారు.


నూతనంగా నిర్మించినట్లే

ఈ కార్యక్రమంలో మూలవిరాట్ లోకి తిరిగి మూలవిరాట్ ని నూతనంగా నిర్మించినట్లేనని చెబుతారు.అష్టబంధన బాలాయన మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 16వ తేది వరకూ జరగనుంది. 


క్లుప్తంగా చెప్పాలంటే

 ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు.