కర్నూలు, కడప జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు


జూలై 18 నుంచి 29వ తేదీ వరకు కర్నూలు, కడప జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జూలై 18 నుంచి 29వ తేది వరకు కర్నూలు, కడప జిల్లాలలోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. 

ఈ నెల 27వ తేది చంద్రగ్రహణం కారణంగా కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సుంకేశుల గ్రామంలో ఉదయం 10 గంటలకు, మిగిలిన అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

కర్నూలు జిల్లాలో….

జూలై 18వ తేదీన ఆళ్లగడ్డ మండలం, ఉయ్యాలవాడ గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆశ్రమం ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

జూలై 19న జూపూడు బంగ్లా మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

జూలై 20న ఆత్మకూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

జూలై 21న వెలుగోడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

జూలై 22న మహానంది మండలం, పుట్టుపల్లి గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

జూలై 23న రుద్రవరం మండలం, యల్లవత్తుల గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

కడప జిల్లాలో …..

జూలై 25 మైలవరం మండలం పెదకామెర్ల గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

జూలై 26న చాపాడు మండలం, సీతారామపురం గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

జూలై 27న ఖాజీపేట మండలంలోని కె.సుంకేశుల గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

జూలై 28న ఒంటిమిట్ట మండలంలోని గుట్టకిందపల్లె గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

జూలై 29న రాజంపేట మండలంలోని హస్తవరం గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.