పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు, మరి పూజలు ఎందుకు?


మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు
 కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి ? అని కొంతమందికి అనుమానం వస్తుంది . 

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట . 

"నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను,
మీరు మీ ఉపాసనలతోటి ,మీ అర్చనలతోటి మార్చుకోగలరు" అని రాసారంట . అర్చనలు, ఉపాసనలు ,కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు . 

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది . 

ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు . 
పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది .

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,
ఇతనికి 50వ ఏట మరణ గండం ఉంది . ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ . 

అతని అదృష్టం బాగుండి ,ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు . 

జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి , జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే… 
అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…

 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి , గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది , జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు . 

కాబట్టి బ్రహ్మ రాసిన రాత ,బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాతలో మార్పు కలుగుతుంది .

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుని   పాదాలను  స్మరించాలి . 

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి ,దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు . కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ  చేసిన పాపానికి నశించాడు . 

అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు . 

అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు ,సాటివానికి సహాయం చెయ్యండి . భగవంతుణ్ణి శరణు వేడండి .