Banner AD

Just Watch

>

ఆగస్టు 24న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం :: ఆగస్టు 23న కరంట్‌ బుకింగ్‌లో టికెట్ల విక్రయం


తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. 

ఇందుకోసం ఆగస్టు 23న ఉదయం 9 గంటల నుండి ఆలయం వద్దగల కుంకుమార్చన కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో టికెట్లు విక్రయిస్తారు. రూ.500/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.

తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. 





అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. 

ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది.