శ్రీ కోదండరామాలయానికి కానుకగా రూ.5 లక్షలు విలువైన మూడు కిరీటాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి బుధవారం రూ.5 లక్షలు విలువైన మూడు కిరీటాలు కానుకగా అందాయి. శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ శ్రీ మన్నెం రామిరెడ్డి ఈ మేరకు కిరీటాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి ఝాన్సీరాణికి అందజేశారు. వీటిని శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు.