శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు పోస్టర్ల ఆవిష్కరణ


తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు పోస్టర్లను ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి గురువారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ ఆగస్టు 6న సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 

ఆగస్టు 7వ తేదీ ఉదయం యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 8న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఆగస్టు 9వ తేదీ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని తెలియజేశారు. 

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామన్నారు.

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.