డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలుడయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రగించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు :


ఈ ఏడాది సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మూెత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మూెత్సవాల పనులను ఆగష్టు చివరినాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నాం.

శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ :


తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం వైదిక కార్యక్రమాన్ని ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తాం.

ఈ సందర్భంగా శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్‌ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం, ఇతర ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం.

ఈ కార్యక్రమం జరిగే ఆరు రోజుల్లో కలిపి మొత్తం 1,94,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తాం.

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు :


తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 21 నుండి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం.

ఇందులో భాగంగా ఈ మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరుగనుంది.

ఆగస్టు 10 నుండి శ్రీవారికి పుష్కరిణి హారతి :


తిరుమల శ్రీవారికి ఆగస్టు 10వ తేదీ నుండి పుష్కరిణి హారతిని పునరుద్ధరించడం జరుగుతుంది. ఆగస్టు 11 నుండి మహాసంప్రోక్షణ, సెప్టెంబరు 13 నుండి శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ఉన్న నేపథ్యంలో నెల రోజుల ముందుగా పుష్కరిణి మరమ్మత్తులు పూర్తి చేశాం.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణ :

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 4, 5, 6వ తేదీలలో బాలాలయ మహాసంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం.

ఆగస్టు 1 నుండి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం :


తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ నుండి బ్రేక్‌ దర్శనం అమలవుతుంది. ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు, సాయంత్రం 7.00 నుండి 7.30 గంటల వరకు బ్రేక్‌ దర్శనం ఉంటుంది.

ప్రోటోకాల్‌ విఐపిలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్‌ దర్శనాన్ని ప్రవేశపెట్టాం.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24వ తేదీ వరలక్ష్మీ వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దర్శనం :


– గతేడాది జూలైలో 24.19 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది జూలైలో 23.46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :


– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది జూలైలో రూ.93.93 కోట్లు కాగా, ఈ ఏడాది జూలైలో రూ.102.92 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :


– గతేడాది జూలైలో 57.16 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది జూలైలో 57.32 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :


– గతేడాది జూలైలో 92.95 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది జూలైలో 1.02 కోట్లు లడ్డూలను అందించాం.