ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లుభక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌, ఈ దర్శన్‌, పోస్ట్‌ ఆఫీస్‌లలో ఈ నెల 7వ తేది మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటల నుంచి బుక్‌ చేసుకునేందుకు వీలుగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

రూ.300/- దర్శన టికెట్లను నిర్దేశిత కోటాలో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. 

అదేవిధంగా నవంబరు నెలలో వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో ఇదే సమయానికి పొందవచ్చు. 

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి సౌకర్యాలను బుక్‌ చేసుకోవాల్సిందిగా టిటిడి కోరుతోంది.