శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం
తిరుమల శ్రీవారికి బుధవారం ద్విచక్రవాహనం విరాళంగా అందింది. 

తిరుపతికి చెందిన శ్రీ పృధ్వి మోటార్స్‌ నిర్వాహకులు ఈ మేరకు రూ.60 వేలు విలువైన హీరో ప్లెజర్‌ ద్విచక్ర వాహనాన్ని అందజేశారు.శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత ఈ మేరకు ద్విచక్రవాహనం తాళాలను ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ శ్రీ భాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.