మార్చి 20వ గరుడసేవ రద్దు


ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఐతే  మార్చి 20వ తేదీన శ్రీవారి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. 

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మార్చి 16వ తేదీ నుండి శ్రీవారి తెప్పోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా బుధ‌వారం పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు.

శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం .