మార్చి 31న అలిపిరిలో మెట్లోత్సవం


శ్రీ తాళ్లపాక అన్నమయ్య 516వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 31వ తేదీ టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 5.30 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. టిటిడి ఉన్నతాధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.




అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 నుండి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ప్ర‌ముఖ విద్వాంసుల‌తో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.



అదేవిధంగా ఏప్రిల్ 2, 3వ తేదీల‌లో తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్త‌న‌ల‌పై విశేష కృషి చేసిన దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప్రముఖ విద్వాంసుల‌తో జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు.

** Click for Download "Daivadarshan" App for devotional