యాదాద్రి పుణ్యక్షేత్రంలో అష్టోత్తర శతఘటాభిషేకం



యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఉదయం బాలాలయంలో స్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 


108 కలశాలలోని పవిత్ర జలాలతో చేపట్టిన ఘటాభిషేకంతో ఉత్సవ పూజలు ముగిశాయని ఆలయ ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. 

పాంచారాత్ర ఆగమ శాస్త్ర రీత్యా ఉత్సవ కార్యక్రమాలు చేపట్టారు. బాలాలయంలో 108 కలశాలను పూజించి విశేష అభిషేకానికి శ్రీకారం చుట్టారు. 


విశేష అభిషేకంలో కవచ, ఉత్సవ మూర్తులకు అవ, బృద స్నానం జరిపారు.

 ఈ విశిష్ట పర్వంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.