అభిషేకాల ద్వారా పాలు వృధా చేయడమేనా?



ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. అభిషేకాల ద్వారా ఆలయాల్లో శుద్ధి చేయడం పరిపాటి. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 

 అయితే ఆలయాల్లో దేవుళ్ళకు కడవలతో పాలు పోస్తుంటారు. అన్ని పాలు వృధా చేయడం కంటే పేదలకెందరికో పంచవచ్చు కదా అని కొందరు అనుకుంటుంటారు.  

 'పారబోస్తే' వృధా అంటారు కానీ 'అభిషేకిస్తే' వ్యర్థం కాదు. దేవుడు అంటే విశ్వకారక దివ్య శక్తి. ఆ భావంతో మంత్రపూత విగ్రహాన్ని అభిషేకిస్తే అది పుష్టినిస్తుంది. 




చెట్లు మొదల్లో నీరు పోస్తే చూడడానికి పారబోసినట్లు కనిపించవచ్చుగానీ అది మూలం ద్వారా చెట్టంతటికీ పుష్టినిస్తుంది.



కొమ్మలలో పువ్వులు కావాలంటే మూలానికి నీరు పోసినట్లే, ప్రపంచ క్షేమం కోసం భగవంతుని ఆరాధిస్తాం.
కేవలం మనిషి తాగడమే సార్థకం అనుకోవడం అవివేకం.

 ఆ మాటకొస్తే మనిషి నోట్లో పోసి వృధా చేసేకంటే దూడచేత తాగిస్తే మేలు అనుకోవచ్చు కదా!

నమ్మకం లేని వాళ్ళు వృధా అనుకోవచ్చు. శాస్త్రాన్నీ, దైవాన్నీ నమ్మేవారికి అది వ్యర్థం కాదు. ఒక యజ్ఞం, ఒక ఆలయంలోని దేవతారాధన - లోకానికి క్షేమం కలిగించడం నేటికీ చూస్తూనే ఉంటాం. 

వివిధ అభిషేకాల ద్వారా కలిగే ఫలితాలు 



* నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. 

* ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. 
ఆవు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది. 

* పంచదారలో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు. 

* విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది

* శంఖువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు. 

* చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 

* కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది. 

* మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది. 

* స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి. 

* పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 

* కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు. 

* చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది



* పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది. 

* చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. 

* తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. 

* అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. 

* అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి. 

* సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది. 

* నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది.