Banner AD

Just Watch

>

శివతత్వం తెలుసుకోకుండా జాగారం చేస్తే ప్రయోజనమేంటి ..?


మహాశివరాత్రి .. హిందువులకు పరమ పవిత్రమైన రోజు .. ఈ రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు . జాగారం చేస్తారు .. 
శివుడి భావన అర్థం చేసుకోకుండా జాగారం చేస్తే ప్రయోజనమేంటి ..? కేవలం పూజలు , ఉపవాసాలు చేస్తే ఏం ఫలితం ఉంటుంది , అయితే అసలు శివతత్వం గురించి తెలుసుకోకుండా .. ? 

శంకర భగవత్పాదులవారు శివ మానస పూజా స్తోత్రంలో ఇలా చెప్పారు .. ' ఆత్మా త్వం గిరిజామతిః , సహచరాః ప్రాణాః , శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా , నిద్రా సమాధి స్థితిః , సంచారః పదయోః ప్రదక్షిణవిధిః , స్తోత్రాణి సర్వాగిరౌ , యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌' అన్నారు .
అంటే .. ' స్వామీ ! నా ఆత్మయే నీవు నా బుద్ధియే అమ్మవారు నాప్రాణాలే నీ సహచరులు , నా శరీరమే నీ గృహము , నా కార్యక్రమాలే నీకు చేసే పూజలు , నా నడకే నీకు చేసే ప్రదక్షిణ , నా మాటలన్నీ నీ స్తోత్రాలే అంతెందుకు నేను చేసే పనులన్నీ నీ ఆరాధనే' అంటూ జీవునికీ దేవునికీ అద్వైతాన్ని బోధించారు .

శివం అంటేనే మంగళమని అర్థం . శివపార్వతులిద్దరిదీ ఏకరూపమే . మనం అర్ధనారీశ్వర తత్వంలో తెలుసుకోవలసిన విషయం కూడా ఇదే . ప్రకృతి పురుషుల సమన్వయ స్వరూపమే సృష్టికి మూలం . 
 ఇదీ శివతత్వం .