ఉపవాసం రోజు ఏమి తీసుకోవచ్చు ?



శివరాత్రి హిందువులకు చాలా పవిత్రమైన పండుగ . ఆ రోజు జాగారం చేస్తే సకల పుణ్యాలు లభిస్తాయని .. పాపాలు హరించుకుపోతాయని నమ్ముతారు . కొందరు శివరాత్రి రోజు జాగారంతో పాటు ఉపవాసం కూడా ఉంటారు . అలాంటి వారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది .


ఉపవాసం చేసేవారు కొందరు పూర్తిగా ఆహారం మానేస్తారు . మరికొందరు పళ్లు తీసుకుంటారు . చాలామంది పండ్ల రసాలు , పళ్లు కొద్దిగా ఆహారంగా తీసుకుంటారు . ఎవరైనా సరే ఉపవాసం ఉండే ముందురోజు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు . 



అంతేకాదు .. ఉపవాసం ఉండే రోజు ముందు రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి .
దీనివల్ల ఉపవాసం రోజు మీకు ఇబ్బంది కలగదు . అలాగే ఉపవాసం ఉండే ముందు రోజు కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు . 



ఆరోగ్యకరంగా ఉపవాసం చేయాలనుకునేవారు ఆహారం తీసుకోకపోయినా సరే సరిపడా నీరు మాత్రం తీసుకోవాలి . సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి .


ఉపవాసం ఉన్న సమయంలో పండ్లు తినేటట్టయితే ... తాజా పండ్లను మాత్రమే తీసుకోవాలి . కడుపు నింపే అరటిపండ్లు మరియు పాలు వంటివి ఉపవాసం రోజున తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు . 

అలాగే ఉపవాసం ముగియగానే .. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం చేయకూడదు .