అనంతవరం గ్రామం , శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు


టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. సోమ‌వారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌య్యాయి.

మార్చి 19వ తేదీ 

ఉదయం 9 గంటలకు మేష లగ్నంలో ధ్వజారోహణం,

 రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ 

 మార్చి 20న 

రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవం

మార్చి 21న‌ 

ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వ‌సంతోత్స‌వం, చక్రస్నానం, పూర్ణాహుతి

రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి. 



మార్చి 22న

 సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం 

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజూ ఉద‌యం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజ‌ల్‌సేవ నిర్వహిస్తారు.

 ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ ఆలయంలో మార్చి 23, 30వ తేదీల్లో ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు నిర్వహిస్తారు.