ఆన్‌లైన్ ద్వారా గ‌దులు : సింగిల్ స్లాట్ ప‌ద్ధ‌తి


తిరుప‌తిలోని విష్ణునివాసం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయంలో ఆన్‌లైన్ ద్వారా గ‌దులు బుక్ చేసుకునే భ‌క్తుల సౌక‌ర్యార్థం సింగిల్ స్లాట్ విధానాన్ని టిటిడి ప్ర‌వేశ‌పెట్టింది. 

నూత‌న ప‌ద్ధ‌తి ద్వారా ఉద‌యం 8 నుండి మ‌రుస‌టిరోజు ఉద‌యం 8 గంటల వ‌ర‌కు 24 గంట‌ల స్లాట్ విధానం అమ‌ల్లోకి రానుంది.

ఇప్ప‌టివ‌ర‌కు 
ఉద‌యం 12 నుండి 6 గంట‌ల వర‌కు, 

ఉద‌యం 6 నుండి 12 గంట‌ల వ‌ర‌కు, 

మ‌ధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు, 

సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు
 నాలుగు స్లాట్ల‌లో భ‌క్తులు ఆన్‌లైన్‌లో గ‌దులు బుక్ చేసుకునేవారు. 

ఈ విధానంపై భ‌క్తుల నుండి ప‌లు ఫిర్యాదులు వ‌చ్చిన నేప‌థ్యంలో 24 గంట‌ల సింగిల్ స్లాట్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. 

ఈ విధానంలో భ‌క్తులు బుక్ చేసుకున్న స‌మ‌యం నుండి 24 గంట‌లలోపు గ‌దిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అనగా ఉద‌యం 8 నుండి మ‌రుస‌టిరోజు ఉద‌యం 8 గంటల వ‌ర‌కు .  

బుక్ చేసుకున్న స‌మ‌యం కంటే ఆల‌స్యంగా చేరుకున్నప్పటికీ  నిర్దిష్ట స‌మ‌యానికి మాత్రం  ఖాళీ చేయాల్సి ఉంటుంది అని నిర్వహకులు తెలియచేశారు .