ఆన్‌లైన్‌లో ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాల‌య ఆర్జిత‌సేవా టికెట్లు

 టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ‌రామాల‌య ఆర్జిత‌సేవా టికెట్లు ఏప్రిల్ 1 నుండి ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్నామని టిటిడి నిర్వాహకులు చెప్పారు. 


ఆల‌యంలో నెల‌కు ఒకసారి పున‌ర్వ‌సు న‌క్ష‌త్రం రోజున ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌రకు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. 

గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.1000/- టికెట్ కొనుగోలు చేసి పాల్గొన‌వ‌చ్చు. 

మొత్తం 100 టికెట్లు ఉండ‌గా ఆన్‌లైన్‌లో 50 టికెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు. 

అదేవిధంగా ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి అభిషేకం నిర్వ‌హిస్తారు. 

గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.150/- టికెట్ కొనుగోలు చేసి పాల్గొన‌వ‌చ్చు. మొత్తం 50 టికెట్లు ఉండ‌గా ఆన్‌లైన్‌లో 25 టికెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు. 

ఆర్జిత‌సేవా టికెట్లు పొందిన భ‌క్తులు అర‌గంట ముందుగా హాజ‌రుకావాల్సి ఉంటుంది.

 శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో ఏప్రిల్ 12 నుండి 22వ తేదీ వ‌రకు ఆర్జిత‌సేవ‌ల‌ను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.