దివ్య దర్శనం టోకెన్లు మరియు సర్వ దర్శనం టోకెన్లను రద్దు


 వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో, విద్యా సంస్థల పునఃప్రారంభానికి ముందు వచ్చే వారాంతపు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అదే విధంగా ఆదివారం జూన్ 9వ తారీఖున సర్కారీ సహస్ర కళాశాభిషేకం దాదాపు మూడు గంటల పాటు జరుగనున్న కారణంగా, టిటిడి ఆదివారం కాలిబాట భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లు మరియు సర్వ దర్శనం టోకెన్లను రద్దుచేసింది.

కావున భక్తులు సర్వ దర్శనంలో మాత్రమే స్వామివారిని దర్శించుకోవలసి ఉంటుందని టి టి డి తెలియజేస్తున్నది.
భక్తులు దయచేసి టి టి డి కి సహరించాలని విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది