banner

ఆధ్యాత్మిక జ్ఞానం_0236. సామవేదానికి ఉపవేదం?
గాంధర్వ వేదం

37. దశరథుడు ఏ రాక్షసునితో పోరాడుతూ యుద్ధ భూమిలో మూర్చపోయాడు?
శంబరాసురుడితో

38. పద్మపురాణములో ఎన్ని శ్లోకములు ఉన్నవి?
85,000 శ్లోకములు

39. సీతమ్మ తన ఆనవాలుగా రామునికిమ్మని ఏ ఆభరణాన్ని హనుమంతునికిచ్చింది?
చూడామణి

40. వామన పురాణమును ఎవరు ఎవరికి ఉపదేశించారు?
పులస్త్య ఋషి నారద మహర్షికి

41. బ్రహ్మపురాణమును ఎవరు ఎవరికి చెప్పినారు?
బ్రహ్మ దక్షునకు వివరించినాడు

42. శుక్రాచార్యుని అసలు పేరు ఏమిటి?
శుసనుడు

43. శ్రీకృష్ణుని మిత్రుడైన కుచేలునికి గల మరో పేరు ఏమిటి?
సుదాముడు

44. మహాభారతంలో సహదేవుని భార్య పేరు ఏమిటి?
విజయ

45. ధర్మరాజు దగ్గర వున్న శంఖం పేరు ఏమిటి?
అనంత విజయం

46. కంసుని రాజ గురువు ఎవరు?
గర్గ మహర్షి

47. వనవాసానికి బయల్దేరిన రాముడికి శృంగిబేరపురంలో ఎవరు ఆతిద్యమిచ్చారు?
గుహుడు

48. మహాభారతంలో శకుని యొక్క కుమారుని పేరు ఏమిటి?
ఉలూకుడు

49. కూర్మపురాణంలో ఎన్ని శ్లోకములు ఉన్నవి?
17,000ల శ్లోకములు

50. ద్రౌపది తండ్రి పేరు ఏమిటి?
ద్రుపదుడు

51. మహారాజుగా పుట్టి సప్తర్షులలో ఒకరిగా ఖ్యాతి పొందినది ఎవరు?
విశ్వామిత్రుడు

52. కంసుని తల్లి ఎవరు?
పద్మావతి

53. అజ్ఞాతవాస సమయంలో సహదేవుని పేరు ఏమిటి?
తంత్రీపాలుడు

54. మహాపతివ్రత అయిన గాంధారి (ధృతరాష్ట్రుని భార్య) తండ్రి ఎవరు?
సుబలుడు

55. బ్రహ్మపురాణంలో ఎన్ని శ్లోకములు కలవు?
పదివేల శ్లోకములు

56. అజ్ఞాత వాస సమయంలో నకులుని పేరు ఏమిటి?
దామగ్రంథి

57. భరద్వాజ మహర్షి కుమారుడు ఎవరు ?
యవ క్రీతుడు

58. భీష్ముడు విలువిద్యను ఎవరి వద్ద అభ్యసించినాడు ?
పరశు రాముని వద్ద

59. భగీరథునికి పూర్వం గంగను భూమికి తేవడానికి ప్రయత్నించినది ఎవరు ?
దిలీప మహారాజు

60. నలుడు (నల, దమయంతులు) ఏ రాజ్యానికి అధిపతి ?
నిషధ దేశము

61. తూర్పు దిక్కును పాలించేది ఎవరు?
ఇంద్రుడు

62. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి చేరడాన్ని ఏమంటారు?
సంక్రమణం

63. పురాణాలన్నింటిలోనూ ఏది అత్యంత పురాతనమైనది?
మత్త్యపురాణం

64. శంతనుడు (భీష్ముని తండ్రి ) సత్యవతుల కొడుకులు ఎవరు?
చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు

65. మహాభారతాన్ని వ్యాసుడు చెప్పగా దానిని వ్రాసినది ఎవరు?
వినాయకుడు

66. బ్రహ్మ నిద్రలో ఉండగా అతని ముఖం నుండి వెలువడిన వేదాలను దొంగలించినది ఎవరు ?
హయగ్రీవుడు అనే రాక్షసుడు

67. ధ్రువుని (ధ్రువతార) భార్య అయిన భ్రమి యొక్క తండ్రి ఎవరు?
శింశుమారుడు

68. మత్స్యావతారంలో ఉన్న పరమాత్మ మత్స్యాపురాణ సంహితను ఎవరికి చెప్పాడు?
సత్యవ్రతుడు, సప్తర్షులకు

69. హనుమంతుడు సముద్రము దాటుచుండగా తన శిఖరముపై విశ్రాంతి తీసుకొనుము అని కోరినది ఎవరు?
మైనాకుడు

70. ఎవరు భీముని గదా ఘాతములచే నీ తొడలు భగ్నమగును గాక అని దుర్యోధనుని శపించిరి?
మైత్రేయ మహర్షి

71. శ్రీరామ భక్తుడైన తులసీదాసు భార్య పేరు ఏమిటి?
రత్నావళి

72. పరమ విష్ణు భక్తుడైన అంబరీషుని తండ్రి పేరు ఏమిటి?
నాభాగ మహారాజు

73. ధ్రువుడు (ధ్రువతార) శ్రీహరిని గూర్చి ఏ ప్రాంతంలో తపస్సు చేసాడు?
యమునా తీరంలో గల మధువనంలో

74. సత్రాజిత్తుని చంపి, స్యమంతకమణిని కాజేసినది ఎవరు ?
శతధన్వుడు

75. భక్తరామదాసు అసలు పేరు ఏమిటి ?
కంచర్ల గోపన్న

76. మహాభారతంలో విరాటరాజు భార్య పేరు ఏమిటి?
సుధేష్ణ

77. ఎవరి శాపము వలన వాలి ఋష్యమూక పర్వతం మీదకి వెళ్లలేడు?
మతంగ ముని

78. భారతంలో పాండురాజు       భార్యల పేర్లు ఏమిటి?
కుంతీదేవి, మాద్రి

79. విక్రమార్కుడు ఏ నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు?
ఉజ్జయినీ నగరాన్ని.