banner

జీవితం ఒక రణరంగంయద్భావం తద్భావతి__ ఇదే జీవిత మర్మం

జీవితం ఒక రణరంగం అనుకొనే వారికి అదొక "యుద్ద రంగం"----

***
జీవితం ఒక సమస్యల సుడిగుండం అనుకునే వారికి అదొక అంతు చిక్కని "పద్మవ్యూహం"----
***
జీవితాన్ని చూసి భయపడే వారికి అదో పెద్ద పెనుభూతం -------
***
తామరాకు ఫై నీటి బిందువులా జీవితాన్ని భావించే వారికి అదో గీతర్ధ సారం ----
***
జీవితం అంటే ఒక మధుర స్వప్నం అనుకునే వారికి అదొక "భూలోక స్వర్గం "
***
"యద్భావం తద్భావతి " అన్న రీతిగా ఉంటుంది--- జీవితం
***
ఇక్కడ మీకో చిన్న కధ  ....
***
ఒక రోజు ఒక చాకలివాని బట్టలు మోసే గాడిద పొరపాటున కాలుజారి, ఆ ఊరి వెలుపలి పాడుపడిన బావిలో పడింది. 
ఎత్తు నుంచి పడటంతో దాని నడుము విరిగిపోయినంత పని అయ్యింది. దీనితో స్ప్రుహ తప్పి సొమ్మ సిల్లి అలా ఆ బావిలోనే ఉంది పోయింది. 

సాయంత్రానికల్లా ఇంటికి రావలసిన గాడిద రాక పోవడంతో చాకలి దిగులుతో తన గాడిద కోసం ఊరు వాడ అంతా గాలింపు ప్రారంభించి... సాయం సమయానికి... నీరు లేని, వాడుకలో లేని ఊరు వెలుపలి దిగుడు బావిలో తన గాడిద పడిపోయి ఉండడాన్ని గమనించి, అది చనిపోయిందని భావించి అదే బావిలో మరో మనిషో, మరో జంతువో పడి ప్రాణాలు కోల్పోకుండా తన ప్రియమైన గాడిదను బలిగొన్న ఆ బావిని పూడ్చి వేయాలని నిశ్చయించుకొని ఆ పనీదో ఆ రాత్రికి రాత్రే చెయాలని నిర్ణయించి అప్పటికప్పుడు ఊరివారి సాయంతో పది బల్ల మట్టి తెప్పించి ఆ రాత్రి తనతో పాటు మరో ఇరువురు కలిసి మట్టిని బావిలో పరలతో నెడుతూ బావి పూడ్చడం ఆరంబించారు. 

అంత ఎత్తునుండి మట్టి తన ఒంటి పై పడటంతో గాడిదకు తెలివి వచ్చింది. జరుగుతుందేమితో, జరగబోయేదేమిటో దానికి అర్ధమైపోయింది. అది తెలివిగా పై నుండి మట్టి బావిలోకి పది అది తన వంటిపై పడినప్పుడల్లా తన ఒంటిని విదిలించడం మొదలు పెట్టింది. ఫలితంగా తెల్లవారే సరికి బావైతే మట్టితో మునిగిపోయింది కానీ ఆ మట్టిలో గాడిద సమాధి కాలేదు. తోక ఊపుకుంటూ ఆ మట్టితో పాటు పైకి వచ్చేసింది.
***
ఈ కధలోని మర్మం గుర్తించగలిగితే మన "జీవితం" మహాత్తరంగా మారిపోతుంది.

***
"జీవితం" లో కష్టాలు బావిలో ఉన్నా గాడిద పై పడిన తట్టల తట్టల మట్టిలా మనపై పడటం మనల్ని నొప్పించడం అతిసహజంగానే జరుగుతూనే ఉంటుంది. వాటి కారణంగా మనం అటు శారీరకంగా ఇటు మానసికంగా క్రున్గిపోయామా వాటిలో మన జీవితం సమాధి అయిపోవడం తద్యం.

***
కష్టాలు, నష్టాలు, భాధలు కన్నీళ్లు కట్ట కట్టుకొని, చుట్ట చుట్టుకొని సుడిగుండాల్లా మనల్ని చుట్టుముట్టినా సరే సింహం జూలు విదిలించినట్లు ఒక్కసారి విదిలించి వీసి చిరుతపులిలా జీవించడంలో ముందుకు దూసుకు పోవాలి. అలా దూసుకుపోయిననాడు ఏదో ఒక నాటికి మీరనుకున్నది సాధించగల్గుతారు

***
ఇందుకు మీరు సిద్దం కావాలన్నమీ మనసును సిద్దం చెయ్యాలన్నా మీరు కొన్ని నియమాలు పాటించక తప్పదు......
***
1) మీలోని భయాలను తొలగించుకోండి.

2) అవి ఏ రూపంలో ఉన్నా వాటినుండి బయటపడే ప్రయత్నం చెయ్యండి.

౩) పలురకాల ఆందోళనలు మిమ్మల్ని తరచూ వర్రీ చేస్తుంటాయి. ఏ వర్రీ మిమ్మల్ని ఎంతగా వర్రీ చేసినా మీరు వర్రీ అయిపోకండి. ఆ వర్రీలన్నీ ఒక డైరీలో వ్రాసుకోవడం అలవాటు చేసుకోండి.

***
కొన్ని రోజుల తరువాత ఆ డైరీ చదివితే అనవసరమైన విషయాలకు అనవసరంగా ఇంతకాలం వర్రీ అయిపోయామని మీరే గ్రహిస్తారు. " అసూయా ద్వేషాలకు అతీతంగా జీవించండి.
***

మీ జీవితంలో జరిగిన సుఖాలను, మంచినీ మరీ మరీ తలచుకొని ఆనందించండి.

***
కష్టాలను, నష్టాలను, అవమానాలను, అవహేలనలను అప్పటికప్పుడే మరిచిపోయే ప్రయత్నం చెయ్యండి. అవి తీపి జ్ఞాపకాలు కావు మరల మరల గుర్తు తెచ్చుకునేందుకు.
***

పల్లీలు తింటూ ఆనందించే (సమయంలో ) తరుణంలో చెడు పప్పు తగిలితే వెంటనే తుపుక్కున ఊసేసి ఎలా అయితే చెడు రుచిని నోటి నుంచి దూరం చెయ్యడానికి మంచి పల్లీలు తింటారో అలానే జీవితంలో చెడు అనుభవాలను ఆ క్షణంలో చెడు అనుభవాలను ఆ క్షణంలోనే మీలోంచి తుదిచేయండి. మరలా జీవితంలోకి తీపిని ఆహ్వానించండి.