తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భారీ మొత్తంలో విరాళంతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ ప్రవాస భారతీయుడు భారీ మొత్తంలో విరాళం అందజేశారు. 

అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే భక్తుడు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని ఆయన సమర్పించారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌కు విరాళానికి సంబంధించిన చెక్కులను దాత అందజేశారు. 

తితిదే అధికారులు దాతను సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఒకేసారి భారీ మొత్తంలో నగదు విరాళం ఇచ్చిన భక్తుడిగా శ్రీనివాస్‌ రికార్డు ఎక్కారు.