banner

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేత


  
జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసి వేయనున్నారు.

జూలై 28న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

 కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 27న ఆర్జితసేవలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు

ఈ నెల 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.