banner

మహాత్ముల సూక్తి రత్నావళి

మహాత్ముల సూక్తి రత్నావళి


1)తల్లితండ్రుల తమ సంతానానికి అందించిన వాటికి  ప్రతిఫలం యీ సృష్టిలోనే లేదు.

  -వాల్మికి

2)సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే యిక,మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ,ఆపూవుండవు.             
 -ప్రేమచంద్

౩)మనుషుల్లో వైరానికి అయిదు కారణాలుంటాయి -స్త్రీలు, ఆస్తీపాస్తులు, కఠోరమైన వాక్కులు, కులమత ద్వేషాలు, ఎప్పుడో  తెలిసో తెలియకో చేసిన అపరాధాలు.               

-మహాభారతం

4)మనిషి జీవితంలో అన్నిటికన్నా ముక్యమైన విషయ౦  ప్రతి మనిషి తన  పని తాను నిజాయితీతో వ్యవాహరించగలగడం .                                         
   -షేక్ స్పియర్

5)మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా,వారి గురించి పూర్తిగా తెలిసేదాకా, ప్రజలు వారు చెప్పేది ఒక్క ముక్కయినా వినరు .

 -వినోబాభావే

6)అందమైన వస్తువు నిరంతరం ఆనందాలు జలపాతాలని అందిస్తూ వుంటుంది.అందం తాలూకు ఆనందం నానాటికీ ఎదుగుతుండే జీవన మాధురి.అది ఎన్నటికీ శూన్యంగా వాడిపోదు.                                                      -జాన్  కీట్స్

7)ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది......అప్పుడు మన ఆత్మ సంగీతం ద్వారా సమాదానాలిస్తుంది.

 -రవీంద్రనాథ్ ఠాగూర్

8)ప్రపంచంలో ఎన్నో  రకాల యుద్దాలుంటాయి.అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాస౦గ్రామంలాంటి

స్వామి శివానందుడు

9)మంచి మనుషుల మనసులు వెన్నెలా వుంటాయి.

 తులసీదాసు

10)వైరం అంతమయ్యేది మృత్యువుతోనే.

  వాల్మీకి

11)ఆలోచనల యుద్దంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు.

జార్జి బెర్నార్డ్ షా

12)మనం మంచివారితో సాంగత్యం చేస్తూ జీవనం సాగిస్తుంటే, చెడు గుణాలు సైతం మంచి గుణాలుగా పరిగణి౦చబడుతుంటాయి. గొల్ల వారింట్లో కూర్చుని, కల్లు తాగినా, పాలే తాగామనుకుంటుంది లోకం.

-విదురుడు

13)సరసహృదయం వున్నవారు సాధారణంగా మృదువైన స్వభావం కలిగి వుంటారు.

 -కాళిదాసు

14)అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం వుంటుంది.

 -ప్రేంచంద్

15)కలసిమెలసి జీవించే మానవాళి మనుగడ వికాసంలోని సహజపరిణామమే - అంతర్జాతీయ స్థాయిలో సైతం దశదిశల నుంచి లభించే సంపూర్ణ సహకారం.

    -ఇందిరా గాంధీ

16)మనిషికి తన జీవితంలో సత్యం పలకాలి.....ప్రియమైన మాటలు పలకాలి.అయితే ప్రియంకానప్పుడు, ఆ సత్యాన్ని పలకకుండా ఉండడమే శ్రేయస్కరం.

   -మనుస్క్రతి

17)సౌందర్యమే సత్యం..... సత్యమే సౌందర్యం.

 -జాన్ క్రిట్స్

18)సత్యమార్గం ఎంతో సులభం...... సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం.

  -ఋగ్వేదం

19)భగవంతుడి చల్లనిచూపు లభించకపోతే,మంచి వారితో మైత్ర్హీబంధం అసలేదొరకదు.                                                  -తులసిదాసు

20)మన వాకిట నిలిచినా మంచివారినీ,మహాపురుషులనీ దర్శించుకుంటే చాలు,పుణ్యక్షత్రల్లో చేసిన కోట్లాది తీర్థస్నానాలకి మించిన ఫలం లభిస్తుంది.
                                           -సూరాదాసు

21)బంగారంలోని ప్రతి అణువు ఎంతోవిలువైనది. గడిచే కాలంలోని ఒక్కోక్య ఘడియ సైతం అంతే!

-జె.మేసన్

22)హృదయం నిండా పరులపట్లసానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులని విమర్శించే అధికారం వుంటుంది.

-అబ్రహం లింకన్

23)వివేకానికి మారుపేరుగా నిలిచిపోయే హంసపక్షి స్మశానంలో వుండదు. అలాగే,మంచివారు చెడ్డవారితో కలసి మెలసి వుండలేరు.

  -కౌటిల్యుడు

24)ప్రేమగుణం బాగా పెరిగితే, లభించే సంపద పవిత్రత.

  -రవీంద్రనాథ్ ఠాగూర్

25) మనిషికి మంచి మనసుండాలే గాని,నానావిదాల సంపదలూ వాటంతట అవే కూరుస్తుంటాయి.

  -తులసీదాస్

26)కలసి మెలసి జీవించడానికి బదులుగా చెయ్యగలిగింది- పరస్పర సంపూర్ణవినాసమే!                                              -జవహర్లాల్ నెహ్రు

27)మనసునిండా నిజాయితీ పెల్లుబుకుతుండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు.

 -పండిట్ మోతీలాల్ నెహ్రు

28)మన పూర్వీకులు ఎంతోమంది అనుసరించి,పునీతం చేసిన బాట పైన మనంగూడా ప్రయాణం చేయాలి.ఎందుకంటే ఆ మంచి బాట పై పయనించిన వరికేన్నాడు చలనం వుండదు.

 -మనుస్క్రతి

29)అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి, ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశలపశాలని తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం అనే పదునైనా కత్తి ఒక్కటే.

   -భాగవతం

30)కోపం యమధర్మరాజులాంటిది.తృష్ణ వైతరణి లాంటిది.విద్య కామధేనువు లాంటిది.ఇక సంత్రుప్తి దేవరాజైన ఇంద్రుడు నన్ధనవనం లాంటిది

-చాణక్యుడు