శ్రీనివాస కల్యాణం


టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 15వ‌ నుండి 25వ తేదీ వరకు చిత్తూరు, గుంటూరు జిల్లాలో క‌లిపి 8 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

చిత్తూరు జిల్లాలో ..

మార్చి 15వ తేదీన శాంతిపురం మండలం శివ‌కురుబూరు గ్రామంలో శ్రీ‌నివాస కల్యాణం జరుగనుంది.

మార్చి 16న ప‌ల‌మ‌నేరులోని ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

గుంటూరు జిల్లాలో…

మార్చి 20న అమ‌రావ‌తి మండ‌ల కేంద్రంలోని మునుగోడు గ్రామంలో గ‌ల శ్రీ బాల అంక‌మ్మ‌త‌ల్లి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

మార్చి 21న అచ్చంపేట మండ‌లం పెద్ద‌పాళెం గ్రామంలోని శ్రీ వేంక‌టేశ్వ‌రాల‌యంలో శ్రీ‌నివాస కల్యాణం నిర్వ‌హిస్తారు.

మార్చి 22న క్రొసూరు మండ‌లం గ‌రిక‌పాడు గ్రామంలోని శ్రీ నాగ కాలికామాత ఆల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

మార్చి 23న న‌ర‌స‌రావుపేటలోని ఎస్‌టిపి రోడ్డులో గ‌ల కెఎస్‌పి స్టేడియంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

మార్చి 24న స‌త్తెన‌ప‌ల్లిలోని శ‌ర‌భ‌య్య ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగణంలో శ్రీ‌నివాస కల్యాణం నిర్వ‌హిస్తారు.

మార్చి 25న బెల్లంకొండ మండ‌లం మ‌న్నె సుల్తాన్‌పాళెం గ్రామంలో గ‌ల శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. 

సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి.

 శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

** Click for Download "Daivadarshan" App for Devotional