
ఒక రోజు గురువు, శిష్యుడు భిక్షాటనకు వెళ్తుండగా శిష్యుడికి ఒక సందేహం వచ్చింది అదేమిటంటే నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కానీ ఆత్మా ఎలా ఉంటుంది ? అని. వెంటనే గురువు గారిని అడిగాడు. దానికి సమాధానంగా గురువు గారు ఇలా వివరించారు.
పాలు ఉపయోగపడేవే కానీ ఒక రోజుకు మించితే పాడైపోతాయి కదా! పాలలో మజ్జిగ చుక్క వేస్తె పెరుగు అవుతుంది.
పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది, వేరొక రోజుకు పాడైపోతుంది . అలాగే పెరుగును మధిస్తే వెన్న అవుతుంది. వెన్న మరొక రోజు వరకు ఉంటుంది. ఆ తర్వాత అది కూడా పాడవుతుంది.
కానీ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది. ఈ నెయ్యి ఎప్పటికి పాడవదు.
ఒక రోజులో పాడై పోయే పాలలో ఎన్నటికీ పాడవని నెయ్యి ఎలా దాగి ఉంటుందో అలాగే అశాశ్వితమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది అని చక్కగా వివరించారు గురువు గారు.
మన మస్సును.. సాధన చేసి కరిగిస్తే, పవిత్రత పొంది ఎప్పటికి ఆత్మ స్థితిలో ఉండిపోతుంది