
హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల బాలాజీ భవన్లో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది.
ఈ ఉత్సవాలకు జూన్ 8వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జూన్ 9న ఉదయం 8.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
అదేరోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు.
అలాగే జూన్ 10న ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి హనుమంత వాహనసేవ జరుగనుంది.
జూన్ 11న ఉదయం గజవాహనం, రాత్రి గరుడసేవ నిర్వహిస్తారు.
జూన్ 12న ఉదయం 7.30 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనసేవ జరుగనున్నాయి.
జూన్ 13న ఉదయం 10 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.