శ్రీవారి ఆలయం మూత :: జూలై 16న రా|| 7 నుండి


చంద్రగ్రహణం కారణంగా జూలై 16వ తేదీ రాత్రి 7 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం త‌లుపులు మూసివేస్తారు. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

జూలై 17వ తేదీ బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుండి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.

జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.

కాగా ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 16, 17వ తేదీల్లో ఆర్జితసేవలు రద్దు

జూలై 16న మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంతోపాటు చంద్రగ్రహణం కారణంగా అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు ర‌ద్ద‌య్యాయి. 

అదేవిధంగా జూలై 17న ఆణివార ఆస్థానం కార‌ణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.