అంతర్జాతీయ యోగ దినోత్సవంయోగా అనేది 5౦౦౦సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలం కొన్ని శారీరిక  కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.

విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటేపరిపూర్ణ జీవనసారవిధానము .దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము , రాజ యోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైనచెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని , ఏకత్వాన్ని తీసుకువస్తాయి.


భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 2015 నుంచి ఏటా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. నిత్యం యోగా చేయడం వల్ల శరీరాన్ని, మనస్సును ఏకం మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

అందుకే ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక ఆరోగ్యం కోసం ప్రపంచం మొత్తం యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకుంటోంది. చక్కటి ఆరోగ్యం కోసం నిర్వహించే అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో యోగా డే ఒకటిగా మారిందని మోదీ ప్రశంసలు గుప్పించారు. 

నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 21 (గురువారం) న జరుపుకోనున్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్యోద్దేశం. యోగా అనే పదం సంస్కృత‌ంలోని యుజ అనే దాని నుంచి వచ్చింది. యుజ అంటే చేరడం లేదా ఏకంచేయడం అని అర్థం. శరీరం, మనసును ఏకచేయడమే యోగాలోని పరమార్థం. దాదాపు 5000 ఏళ్ల చరిత్ర కలిగిన యోగశాస్త్రం ప్రపంచానికి భారతీయులు అందించిన అద్భుతమైన కానుక.‘శాంతి కోసం యోగా’ అనే నినాదంతో ఈ ఏడాది యోగా దినోత్సవం నిర్వహించునున్నారు.

జూన్ 21 వ తేదీనే ఎందుకు?

జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అందుకే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ రోజునే అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రధాన నరేంద్ర మోదీ 2014లో ప్రతిపాదించారు.