banner

క‌ల‌లో ఏ జంతువు క‌నిపిస్తే ఏ ఫ‌లితం ఉంటుంది?

 
నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు... ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుంద‌ని అంటారు. జంతులు మాత్రమే కలలకు భయపడతాయా..? కాదు.. కలల పట్ల భయం అనేది మానవులకూ అనాదిగా ఉంది. అందుకు కారణం.. అన్ని కలలు శుభ ఫలితాలనే కలుగజేయవు. 
 
కలలు - వాటి ఫ‌లితాలు

1. పిల్లి : కలలో మీరు తెల్ల పిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని , నల్ల పిల్లిని చూస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించడానికి భయపడుతాన్నరని అర్ధం. అలాగే పిల్లిని తరుముతున్నట్లు వస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారని సూచన.
2. జింక : కలలో జింక కనిపిస్తే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాతరని, ఆర్ధిక సమస్య మెరుగుపడుతుందని సూచన.
3. ఎద్దు : కలలో ఎద్దు కనిపిడితే బోలెడు సంపద రాబోతుందని, ఆబోతును చూస్తే మీ కోరికలు నియంత్రణ లో లేవని అర్ధం.
4. ఆవు : మీ కలలో ఆవు కనిపిస్తే మీ విధేయత తో మెలగాలని సూచిస్తుంది.
5. ఒంటె : మీ కలలో ఒంటె కనిపిస్తే మీరు భారమైన సమస్యలను మీ భుజాలపై మోస్తున్నారని, మన్నించే గుణం ఎక్కువట.
6. గాడిద : మీ కలలో గాడిద కనబడితే మీకు చికాకులు వస్తున్నాయన్ని, చాలా కష్టపడితే జీవితంలోను, ప్రేమలోను విజయం సాధించలేరని అర్ధం.
7. కుక్క : కలలో కుక్క కనిపిస్తే మీ ప్రత్యర్ధి మీద మీరు విజయం సాధిస్తారని, అలాగే ఒక మంచి స్నేహితుడుని కొల్పొతున్నారని సూచన.
8.పంది : పంది కనిపిస్తే మీకు స్వార్ధం లేదా అత్యాశతో అలోచిస్తున్నారని అర్ధం.
9. ఏనుగు : ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల సహానంతో, ఎక్కువ అవగాహాన వుండాలని అర్ధం.
10. మేక : మేక కనిపిస్తే మీరు సరిగ్గా పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారని, అవివేకపు పనులు చేస్తున్నారని అర్ధం.
11. గుర్రం : మీ కలలో నల్ల గుర్రం కనిపిస్తే హింస మరియు క్షుద్రశక్తులు,తెల్ల గుర్రం కనిపిస్తే అదృష్టమట.
12. పాము : పాము కనిపిస్తే నిజజీవితంలో ఏదో పెద్ద ప్రమాదం ఎదుర్కొబొతున్నారని సూచన.

ఎద్దు పొడిచినట్లు కలలో కనిపిస్తే వారం రోజుల్లో ఏవ్వరితో నైన పొట్లాట జరుగుతుంది


పురాణాల్లోనూ క‌ల‌ల‌కు సంబంధించిన క‌థ‌లు ఉన్నాయి. రామాయ‌ణంలో.. సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒక రోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి, లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది.

కలల ఫ‌లితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి క‌ల‌ల గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే.. వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో వివ‌ర‌ణ‌ కనిపిస్తుంది. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.

అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువు.

కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని శాస్త్రం చెబుతోంది. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది. పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది.

రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలం లోపల అది జ‌రుగుతుందని... రెండో జాములో కల వస్తే 6 నెల‌ల లోపున, మూడో జాములో వస్తే 3 నెల‌ల లోపున, నాలుగో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రం చెబుతోంది . సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజులలోపే జరుగుతుందని అంటారు. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుందని... రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలంటారు. అదే శుభస్వప్నమైతే

నిద్రపోవటం మంచిది కాదు.

ఆకాశంలో మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు. ఇక జంతువులు క‌ల‌లో వ‌స్తే... కుక్క తమను చూసి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షి గుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు కలలు వచ్చినా నిజజీవితంలో మంచి జరగదట.

ఇలా మంచి క‌ల‌ల‌ గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం చెబుతోంది. మంచి క‌ల‌ల వరుసను కూడా ఈ సందర్భంలోనే తెలిపింది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిద‌ని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ.

చెడు క‌ల‌లు దోష శాంతి కోసం పండిత పూజ, నువ్వులతో హోమం చేయ‌డం మంచిది. బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యగణాలను పూజించటం, స్తోత్రాలు, పురుష సూక్తం లాంటి వాటిని పారాయణం చేయాలి.

నిజానికి మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనసు సంతోషంగా వునప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా వుంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతుంటారు. అయితే అలాంటి స్వ‌ప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట‌. మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు.. తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని చెప్పబడుతోంది.

కపిలవస్తు నగరం ప్రభువు శుద్దోధనుడు. భార్య రాణి మాయావతీ దేవి గర్భవతిగా ఉంది. ఆమె ఓ చిత్రమైన కల కన్నది. ఆ కలలో తెల్లని ఏనుగు అంటే ఇంద్రుని ఐరావతం తన గర్భంలో ప్రవేశిస్తున్నట్లు ఆమె చూచింది.

మర్నాటి ఉదయమే రాజదంపతులు జ్యోతిష పండితుల్ని కలని విశ్లేషించవలసిందని అడిగాడు. పండితులు “మహారాజా! పరిణామాలని బట్టి చూస్తే మహారాణి కడుపున ఓ గొప్ప పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పవచ్చు. అయితే ఆ బాలుడు గొప్ప చక్రవర్తి కావచ్చు. లేకపోతే ఓ గొప్ప పరిత్యాగి కావచ్చు. దేనికైనా అవకాశం
 ఉంది” అన్నారు.